శ్రీశైలం: నంద్యాలలో కూటమి నేతల సమన్వయ సమావేశం. పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
నంద్యాలలో కూటమి నేతలు సమన్వయ సమావేశం నిర్వహించారు. కూటమి త్రీ మెన్ కమిటీ సభ్యులతో కలిసి రాబోయే ఎన్నికలపై నేతలు చర్చించారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, భూమా అఖిలప్రియ, గౌరు చరిత, జయసూర్య, బుడ్డా రాజశేఖర్ రెడ్డితో పాటు జిల్లా ఎన్నికల సమన్వయకర్త ప్రభాకర్ చౌదరి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు, జనసేన నాయకులు పాల్గొన్నారు.