రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బదిలీ కావడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో సంబరాలు మొదలయ్యాయి. వరుస వివాదాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచిన కలెక్టర్ చివరకు బదిలీ ఆదేశాలు వెలబడడంతో పలువురు నేతలు సంబరాలు జరుపుకున్నారు. కేటీఆర్ పేరుతో ఉన్న టీ స్టాల్ తొలగించడం, నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిన బాధితులు సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ఎదుట టపాసులు పేల్చేందుకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యంలో సంబరాలు జరుపుకునే హక్కు మాకు లేదా అంటూ బాధితులు పోలీసులతో అన్నారు. పోలీసులు అడ్డుకున్న బాధితులు కలెక్టర్ కార్యాలయం