అశ్వారావుపేట: ITDA గిరిజన దర్బార్: అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించాలని ఆదేశం
ఐటీడీఏ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన దర్బార్లో సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ పాల్గొన్నారు. పోడు భూములు, స్వయం ఉపాధి, వ్యవసాయం మరియు వ్యక్తిగత సమస్యలపై గిరిజనులు సమర్పించిన విన్నపాలను పరిశీలించి, అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.