కాకినాడ సిటీ: కాకినాడలో మెగా రక్తదాన శిబిరం: ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కలెక్టర్ పిలుపు
జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రారంభించారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని ఆదుకోవడంలో రక్తదానం కీలకమని, యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.