అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో అర్ధరాత్రి రౌడీ షీటర్ల ఇళ్లపై ఎస్పీ ఆకస్మిక దాడులు
ఆదిలాబాద్ జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా ఎస్పీ అఖిల్ మహాజన్ రౌడీ షీటర్ల ఇళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసు గస్తీని పటిష్టం చేయాలని ఆదేశించారు.