నందికోట్కూరు: వైద్యుడి కుంచెలో ప్రముఖుల చిత్రాలు
నంద్యాల జిల్లా పగిడ్యాల వైద్య వృత్తిలో కొనసాగుతూనే చిత్రకళలపై ఆసక్తితో అద్భుత చిత్రాలు వేస్తున్నారు డాక్టర్ సుబ్రహ్మణ్యం ప్రముఖ చిత్రకారుడు రవివర్మ చిత్రాలను తలపించేలా తన కుంచెతో బుద్ధుడు, అశోక చక్రవర్తి, మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తదితర ప్రముఖుల చిత్రాలను జీవం ఉట్టిపడేలా రూపొందిస్తున్నారు, గీతలతోనే భావాలను పలికిస్తూ అద్భుత చిత్రాలను వేస్తున్న డాక్టర్ సుబ్రహ్మణ్యాన్ని పలువురు అభినందిస్తున్నారు