పలమనేరు: గంటాఊరు నాగాలమ్మ ఆలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు, భారీ ఎత్తున హాజరైన భక్తులు
పలమనేరు: గంటాఊరు నాగలమ్మ ఆలయం నందు అర్చకులు తెలిపిన సమాచారం మేరకు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమశివుడు కొలువై ఉన్న మహా శివలింగానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్తిక మాస శోభతో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగింది. పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనం గావించి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు.