ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని కమ్మపాలెంలో రెచ్చిపోయిన దొంగలు, రెండు ఇళ్లల్లో నగదు బంగారం చోరీ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Oct 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కమ్మపాలెంలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి యజమానులు ఇంటిలో లేని సమయాన్ని చూసి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువాలు పగలగొట్టారు. రెండు ఇళ్లల్లో రూ.20,000 వేలు నగదు, కొంత బంగారాన్ని దొంగలు దోచుకు వెళ్లారు. సమాచారాన్ని అందుకున్న డి.ఎస్.పి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ ఘటనపై విచారణ చేపట్టారు. దొంగలను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని డిఎస్పి అన్నారు. దొంగతనం జరిగిన తీరును తరితర అంశాలను డిఎస్పి శ్రీనివాసరావు ప్రత్యేకంగా పరిశీలించారు.