రాజోలు: రాజోలులో కీలక సమావేశం: స్థానిక ఎన్నికలపై టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య దిశానిర్దేశం
రాజోలులో జరిగిన 'కేడర్ విత్ లీడర్' కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల సమన్వయంపై ఆమె దిశానిర్దేశం చేశారు. పలు ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.