ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడిలో దళితులపై జరిగిన దాడి విషయంలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఒంగోలులోని అంబేడ్కర్ భవన్ వద్ద సమావేశమయ్యారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరు కలిసేందుకు అందరూ ర్యాలీగా వెళ్లారు. అదే సమయంలో డి.ఎస్.పి శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని వారికి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.