రామచంద్రపురం: రామచంద్రపురంలో జోరుగా 'ఇంటింటికీ తెలుగుదేశం' ప్రచారం: ప్రజలను కలిసిన మంత్రి సుభాష్
రామచంద్రపురం 27వ వార్డులో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.