వికారాబాద్: ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.
వికారాబాద్ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం మధ్యాహ్నంపరిగి మండలం విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని,ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్కు అధికారులు వివరించారు.