వరంగల్: వరంగల్‌లో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన
వరంగల్‌లో ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈడీ కార్యాలయం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు నిరసన చేపట్టారు. దళితుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని, తక్షణమే పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.