కొండపి: సింగరాయకొండ మండలం పాకాల మాజీ సర్పంచ్ నాగరాజు పై ఆర్థిక లావాదేవుల విషయంలో దాడి, పరామర్శించిన మనోజ్ కుమార్
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రస్తుత జనసేన నాయకుడు నాగరాజు పై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. దాడిలో గాయపడి కందుకూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజుని కొండపి జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ మనోజ్ కుమార్ కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.