మార్కాపురం: జిల్లా కేంద్రంలో సాగర్ పైప్ లైన్ల నిర్మాణానికి తీసిన గుంతలతో అవస్థలు పడుతున్న వాహనదారులు
మార్కాపురం జిల్లా కేంద్రం లోని పలు వీధులలో సాగర్ పైప్ లైన్ల నిర్మాణానికి గుంతలు తీసి పూడ్చివేశారు. కానీ రోడ్డుకు లెవెల్ చేయకపోవడంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తూ అదుపు తప్పి కింద పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు