మంచిర్యాల: బీసీల డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఒత్తిడి
నామినేటెడ్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు, లక్ష కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.