ఏటూరునాగారం: ములుగు: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు.. సామగ్రి ధ్వంసం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం రంగాపూర్ గ్రామంలో గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా గుడుంబా తయారీకి వాడే డ్రమ్ములు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. గుడుంబా తయారీ, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.