ఏటూరునాగారం: వెంకటాపురంలో గుడుంబా స్థావరాలపై దాడులు: 9,600 లీటర్ల బెల్లం వాష్ ధ్వంసం
వెంకటాపురం మండలం రామచంద్రపురంలో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సోదాల్లో 9,600 లీటర్ల బెల్లం వాష్‌ను ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.