వరంగల్: వరంగల్ ఆర్జేడీగా బి.వెంకటనర్సమ్మ నియామకం
వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకురాలిగా బి.వెంకటనర్సమ్మకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్జేడీగా ఉన్న విజయలక్ష్మి సెలవులో ఉండటంతో, ఆమె స్థానంలో వెంకటనర్సమ్మను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.