శ్రీశైలం: మహానంది మండలం గోపవరంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు. టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు
మహానందిమండలంలోని గోపవరం గ్రామ పరిధిలోని బైరవాణి చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. టిప్పర్ల ద్వారా చెరువులో నుంచి మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారని వారు తెలిపారు. మట్టి తవ్వకాలు, అక్రమ రవాణాను గుర్తించిన గ్రామస్థులు అడ్డుకుని టిప్పర్లను నిలిపివేశారు. చెరువులో మట్టి తవ్వకాల వల్ల చెరువు స్వరూపం దెబ్బతినడంతో పాటు భవిష్యత్తులో రైతులకు, గ్రామానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన కనిపించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు