ఇబ్రహీంపట్నం: నందిగామ మండల పరిధిలో అంతర్జాతీయ యూత్ సెమినార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం లోని నందిగామ మండల పరిధిలో చేగురు గ్రామంలో కన్హా శాంతి వనంలో అంతర్జాతీయ యూత్ సెమినార్ కార్యక్రమం ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావును రామచంద్ర మిషన్ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు.