అదిలాబాద్ అర్బన్: నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవంతో పాటు, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం మరియు ట్రిపుల్ ఐటీ సందర్శనలో మంత్రి పాల్గొంటారు.