వరంగల్: నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మహిళలతో కొట్టిస్తా: ఎమ్మెల్యే కొండా సురేఖ హెచ్చరిక
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు బస్వరాజు సారయ్య, గుండు సుధారాణిలపై ఆమె మండిపడుతూ, మహిళలతో కొట్టిస్తానని హెచ్చరించారు.