అర్హులైన వీఆర్పీలకు వీఆర్వోలుగా ప్రమోషన్ ఇవ్వాలని వింజమూరు వీఆర్ఎల సంఘ నాయకుడు ఖాదర్ బాషా డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మార్వోకు గురువారం వినతిపత్రం అందజేశామన్నారు. వీఆర్ఎలకు పే స్కేల్ అమలు చేయాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలగా పనిచేస్తున్న వారిని వీఆర్ఎలుగా నియమించాలని కోరారు. అనధికారిక, అక్రమ డ్యూటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.