ఒంగోలు అర్బన్: యాక్సిడెంట్ చేసిన పోలీసులతో పాటు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకున్న పోలీసులు ఉన్నతాధికారులు
Ongole Urban, Prakasam | Aug 21, 2026
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరపాడు వద్ద ఆటోను ఢీ కొట్టిన ప్రమాదంలో పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పి హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ఇందులో భాగంగా సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు విఆర్ కు బదిలీ చేయటంతో పాటు బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు సీఐ శేషగిరిరావులకు చార్జిమెమోలు జారీ చేశారు.దర్శి డిఎస్పి బాలమురళీ కృష్ణకి ఐ జి విచారణ అనంతరం షోకాజ్ నోటీసు జారీ చేశారు. నిన్న సంతమాగులూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు గత ఆదివారం జరిగిన కారు ప్రమాద ఘటనపై విచారణ కోసమే ఉన్నతాధికారులు వచ్చినట్లు సమాచారం తెలిపారు