లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జ్వాలా తోరణం మహత్యం
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి జ్వాలాతోరణ మహత్యాన్ని భక్తులు వీక్షించి అబ్బుర పోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో జ్వాలాతోరణాన్ని చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి విశేషంగా పూజలు జరిపారు