జగిత్యాల: జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల సమ్మె విరమణ: డిసెంబర్ 15లోగా పూర్తిస్థాయి వసతులు
జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన సమ్మెను విరమించారు. మౌలిక వసతుల కల్పనపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇచ్చిన హామీతో విద్యార్థులు ఆందోళనను విరమించారు. డిసెంబర్ 15 నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది.