చోడవరం: బుచ్చెంపేట పీహెచ్సీలో వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు
రోలుగుంట మండలం బుచ్చెంపేట పీహెచ్సీలో ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వృద్ధులకు బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వృద్ధులు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని, పోషకాహారం తీసుకోవాలని వైద్యాధికారి జానకి సూచించారు.