పార్వతీపురం: రావివలస ఆసుపత్రిలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం: అధికారుల పరిశీలన
గరుగుబిల్లి మండలం రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 'స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం జరిగింది. ఆసుపత్రులను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని డీఎంహెచ్ఓ డాక్టర్ పి. విజయలక్ష్మి సూచించారు. కలెక్టర్ గారి 'ఆసుపత్రి ముస్తాబు' కార్యక్రమాన్ని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేయాలని ఆమె ఆదేశించారు.