మోతే: హుస్సేనాబాద్ వద్ద బోల్తా పడిన ప్రైవేట్ బస్సు.. ఐదుగురికి గాయాలు
సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై మోతె మండలం హుస్సేనాబాద్ వద్ద హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. 38 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు విచారణ జరుపుతున్నారు.