డోన్: ముద్దవరం నీరు కలుషితం, పట్టించుకోని అధికారులు
Dhone, Nandyal | Aug 23, 2026 మండల పరిధిలోని ముద్దవరం గ్రామంలో గొల్లపేట కాలనీలో పైపైన్ పగిలిపోయి నీరు వృథా అవుతోంది. దీనికి తోడు పైపైన్ పక్కనే డ్రైనేజీ కాలువ ఉండడంతో నీరు కలిసి జలుబు, దగ్గు, గొంతు నొప్పులతో అల్లాడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా మండలాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.