ఒంగోలు అర్బన్: మద్యం తాగిన డ్రైవర్ను కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు ద్వారా శిక్షిస్తాం : ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు
Ongole Urban, Prakasam | Sep 22, 2026
వినాయక ట్రావెల్ బస్సు ను మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ను బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించి అతనిపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలిస్తున్నట్లుగా ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడటం క్షమించరాని నేరమన్నారు ట్రావెల్ బస్సు ఓనర్లు మేనేజర్లు తప్పనిసరిగా డ్రైవర్లను పరిశీలించిన తర్వాతే బస్సు ఎక్కించాలని లేకుంటే వారిపై కూడా చర్యలు తప్పమన్నారు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఎవరైనా మద్యం సేవించే వాహనం నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు