ఒంగోలు అర్బన్: ఒంగోలులో మైనర్ బాలికల అత్యాచార యత్న ఘటనపై పోక్సో కేసు నమోదు చేయాలని కలెక్టర్ రాజబాబు ఆదేశం
Ongole Urban, Prakasam | Sep 30, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులోని గోపాల్ నగర్ లో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంటిలో కస్తూరిబా గాంధీ విద్యాలయంలో విద్యను అభ్యసిస్తున్న ఇద్దరు విద్యార్థులపై అత్యాచారం యత్నం ఘటన కలకలం రేపింది. ఇప్పటికే ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తక్షణమే ఈ ఘటనకు సంబంధించిన వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. వెంటనే విచారణ జరిపి నివేదికను సమర్పించాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.