పాలకుర్తి: పాలకుర్తి గురుకులంలో ఎలుకల కాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయి విచారణ
పాలకుర్తి గురుకులంలో విద్యార్థులను ఎలుకలు కరిచాయన్న వార్తలపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విచారణ చేపట్టారు. విద్యార్థులను స్వయంగా కలిసి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఎలుకలు కరిచిన ఆనవాళ్లు లేవని, వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు.