బనగానపల్లె: కొలిమిగుండ్ల రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి
బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల సమీపంలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో అనుమానాస్పదంగా నందిపాడు గ్రామానికి చెందిన ఓబులేష్ (40) అనే కార్మికుడు మృతి చెందాడు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైందనీ స్థానికులు ఆరోపిస్తున్నారు. రాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ప్రమాదం జరిగితే కనీస ప్రధమ చికిత్స కూడా అందుబాటులో ఉంచని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం. కనీస వైద్య సౌకర్యాలు లేక అనేకమంది కార్మికులు గతంలో కూడా మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులకు వైద్య సౌకర్యాలను కల్పించి కార్మికుల ప్రాణాలకు భద్రత కల