ఒంగోలు అర్బన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉరుములు మెరుపు లతో కూడిన ఓ మోస్తరు వర్షం, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్న ప్రజలు
Ongole Urban, Prakasam | Oct 15, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గురువారం మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తర్వాత వాతావరణం చల్లబడి ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈనెల 19వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పొడుస్తున్న వర్షాలతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.