శ్రీశైలం: ఆత్మకూరులో చెంచు గిరిజన ఉద్యానవన రైతులకు పరికరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
ఆత్మకూరు మండల ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చెంచు గిరిజన ఉద్యానవన రైతులకు ఐటీడీఏ ఆధ్వర్యంలో వ్యవసాయ పరికరాలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను చెంచు గిరిజన రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగంలో రాణించాలని సూచించారు. ఉద్యానవన పంటల సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.