సంగారెడ్డి: సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డిలో బిజెపి నాయకుల ఆందోళన
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డిలో బిజెపి నాయకులు ఆదివారం ఆందోళన చేశారు. దేశ రక్షణ వ్యవస్థను అవమానపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలని ఆరోపిస్తూ సంగారెడ్డి లోని కొత్త బస్టాండ్ ముందు బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సీఎం దిష్టిబొమ్మను బిజెపి నాయకులు దహనం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. బిజెపి నాయకులు సీఎం కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.