ప్రేమ పేరుతో మోసం చేసారని తనకు న్యాయం చేయాలని చిలకలూరిపేటకు చెందిన బాధితురాలు ఆవేదన
చిలకలూరిపేటకు చెందిన సోడిశెట్టి మంజు భార్గవి ప్రేమ పేరుతో మోసపోయానని, తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి బుధవారం ఫిర్యాదు చేశారు. ఓ కాలేజీ డైరెక్టర్ గా రామానాయుడు అనే వ్యక్తి ప్రేమించి గర్భవతిని చేసి పెళ్లి చేసుకోలేదని ఆరోపించారు.అతని తల్లి, బంధువులు పెళ్లి చేస్తామని నమ్మించి బలవంతంగా రామానాయుడు తమ్ముడితో పెళ్లి చేశారని తెలిపింది. న్యాయం చేయాలని కోరింది.