ఒంగోలు అర్బన్: ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లను తనిఖీ చేసి అనుమానిత వ్యక్తులను విచారించిన పోలీసులు, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
Ongole Urban, Prakasam | Oct 2, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ను శుక్రవారం పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడమే కాకుండా వారి లగేజ్ బ్యాగులను తనిఖీ చేశారు. అలానే వేలిముద్రల పరిశీలన ద్వారా నేరస్తులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నించారు. నేరాల నియంత్రణకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టి తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానిత వ్యక్తులను గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.