కాకినాడ సిటీ: కాకినాడ వినాయక సాగర్ లో ఘనంగా చతుర్ధి హారతి.. జలచరాలకు ప్రత్యేక తర్పణం
కాకినాడ వినాయక సాగర్ వద్ద నగర గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంకష్టహార చతుర్ధి కార్యక్రమం నిర్వహించారు. భారీ ఉండ్రాళ్లతో హారతి ఇచ్చి, జలచరాలకు పేలాలు, మరమరాలను తర్పణంగా సమర్పించారు. గణపతి ఉత్సవాలు విజయవంతం కావడంతో ఈ కార్యక్రమం చేపట్టారు.