హనుమకొండ: హన్మకొండ: ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ధర్నా - మౌలిక సదుపాయాల కల్పనకు డిమాండ్
హన్మకొండ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో కనీస సౌకర్యాలు లేవని 400 మంది విద్యార్థులు అశోక జంక్షన్లో ధర్నా చేశారు. తాగునీరు, బెంచీలు, మరుగుదొడ్ల కొరతపై వారు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు తీరకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.