మందమర్రి: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో రగడ: కమిషనర్ బదిలీకి కౌన్సిలర్ల డిమాండ్
క్యాతన్‌పల్లి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు సహకరిస్తున్నారని, పారిశుధ్యంపై నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపిస్తూ ఆయనను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎజెండా లేదని కాంగ్రెస్ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు.