ధర్మపురి: ధర్మపురి బస్ స్టేషన్ ఆధునీకరణ: 2.57 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జగిత్యాల జిల్లా ధర్మపురి బస్ స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. 2.57 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్లాట్‌ఫారాల విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది.