పూతలపట్టు: కాణిపాకం వినాయక ఆలయ అన్నదానానికి రూ.1,00,116 విరాళం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో నిత్య అన్నదానం కోసం కడపకు చెందిన శ్రీ లోకనాథ శెట్టి రూ.1,00,116 విరాళం అందించారు. ఈ సందర్భంగా దాతకు ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందజేశారు.