ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలోని సివిల్ సప్లై గోదాంలో భారీ రేషన్ బియ్యం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. గోదాం నుండి సుమారు 212 టన్నుల రేషన్ బియ్యం గల్లంతైనట్లు అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఈ విషయంపై అక్రమాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టేందుకు నెల్లూరు పౌరసరఫరాల డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో విజయవాడ నుండి వచ్చిన ప్రత్యేక బృందం గోదాంలో తనిఖీలు ప్రారంభించింది. స్టాక్ రిజిస్టర్లు, రవాణా వివరాలు, లిఫ్టింగ్ రికార్డులు, ముఖ్యమైన ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమాలు ఎలా జరిగాయి.. ? ఎవరి అనుమతితో స్టాక్ బయటకు వెళ్లింది. ఇందులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉ