శ్రీశైలం: ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల పర్యటన
నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ అరుణ్ కుమార్, సహాయ వ్యవసాయ సంచాలకులు ఆత్మకూరు డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల్లోని వివిధ గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న, వరి, సోయాచిక్కుడు, మిరప తదితర ప్రధాన పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. మిరప పంటలో తామర పురుగు నివారణకు పిప్రోనిల్ 80 శాతం డబ్ల్యుజీ మందును లీటర్ నీటికి 0.2 గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. అలాగే రైతులు పొలాలను ఖాళీగా ఉంచకుండా అక్టోబర్ మొదటి వారంలో స్వల్పకాలిక పంటలు సాగు చేయాలన్నారు