పాలసముద్రం సమీపాన రోడ్డు దాటుతుండగా అయ్యప్ప స్వామి భక్తుని ఢీకొన్న కారు అయ్యప్ప స్వామి భక్తుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 6, 2025
శ్రీ సత్య సాయి జిల్లా సోమేందపల్లి మండలం పాలసముద్రం సమీపాన గురువారం ఉదయం 6:30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అయ్యప్ప స్వామి భక్తుడికి కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆదోని నుండి శబరిమల కు పాదయాత్రగా వెళుతుండగా పాలసముద్రం సమీపాన ఈ ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ధనుంజయ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నదని అత్యవసర విభాగం వైద్యులు డాక్టర్ శ్యామ్ తెలిపారు.