జనగాం: పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలి:Cpm జిల్లా కార్యవర్గ సభ్యులు బూడిద గోపి
జనగామ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో సిపిఎం ఆధ్వర్యంలో సమస్యలపై పర్యటించి సర్వే నిర్వహించారు పలు వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచి ప్రతి రోజు మోరీలు తీసి దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని,కోతుల నివారణ చర్యలు చేపట్టాలని అంతర్గత సీసీ రోడ్డు లేని గల్లీలో సిసి రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11వ తేదీన మున్సిపల్ కార్యాలయం జరిగే ధర్నాలో పట్టణ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు