ఏటూరునాగారం: రోహిర్ గ్రామపంచాయతీ పేరుతో తప్పుడు ఫిర్యాదులు: చర్యలు తీసుకోవాలని డిమాండ్
ములుగు జిల్లా రోహిర్ గ్రామపంచాయతీ పాలక మండలి సభ్యుల పేర్లతో తప్పుడు ఫిర్యాదులు చేశారని సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు. నిందితుడు సౌదార రాజేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.